ఎన్ని నిధులు తెచ్చారు.. ఎంత అభివృద్ధి చేశారు?

ABN , First Publish Date - 2022-03-05T05:23:34+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని నిధులు తెచ్చారు.. ఎంత అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే ప్రసన్న బహిర్గతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎన్ని నిధులు తెచ్చారు.. ఎంత అభివృద్ధి చేశారు?
మాట్లాడుతున్న పోలంరెడ్డి

ఎమ్మెల్యే ప్రసన్నకు పోలంరెడ్డి సవాల్‌ 


ఇందుకూరుపేట, మార్చి 4 : వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని నిధులు తెచ్చారు.. ఎంత అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే ప్రసన్న బహిర్గతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ముదివర్తిపాళెంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవసభలో పోలంరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ముదివర్తి పాళేన్ని రూ.5కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల వరదల్లో ముదివర్తిపాళెం పూర్తిగా నష్టపోతే ఆ సమయంలో  ప్రజలను ఆదుకోవడంలో ఎమ్మెల్యే ప్రసన్న పూర్తిగా విఫలం చెందారన్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. గడిచిన 33 నెలల పాలనలో  కోవూరులో మాఫియాలను తయారు చేసి అన్ని రకాలుగా దోచుకున్న చరిత్ర ఎమ్మెల్యే ప్రసన్నకు దక్కుతుందని తెలిపారు. కాగా కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ఈ సీఎంకు బుద్ధి రావడం లేదన్నారు.  ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇక ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు వీరేంద్రచౌదరి, మునగాల రంగారావు, పి.చెంచుకిషోర్‌యాదవ్‌, శిఖాకొల్లు నాగరాజు, సుబ్రహ్మణ్యం, పద్మ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.  

 

Read more