ఇద్దరు నైట్‌ వాచ్‌మెన్‌పై వేటు

ABN , First Publish Date - 2022-09-22T03:27:05+05:30 IST

మండలంలోని జొన్నవాడ ఆలయంలో పనిచేసే ఇద్దరు నైట్‌ వాచ్‌మెన్‌లకు వేటు పడింది. కామాక్షితాయి ఆలయంలో ఈనె

ఇద్దరు నైట్‌ వాచ్‌మెన్‌పై వేటు

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు21: మండలంలోని జొన్నవాడ ఆలయంలో పనిచేసే ఇద్దరు నైట్‌ వాచ్‌మెన్‌లకు వేటు పడింది. కామాక్షితాయి ఆలయంలో ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి  ఓ వ్యక్తిపై స్థానికుడు రమేష్‌  తన కుక్కతో దాడి చేయించాడు. అయితే విధుల్లో ఉండి కూడా పట్టించుకోకుండా ఉండడంపై ఆ రాత్రి వాచ్‌మెన్‌లుగా  పనిచేసిన ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్టు ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ,ఈవో డీ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. అలాగే సన్నిధివీధిలో ఏర్పాటు చేసిన గేట్లకు మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

---------

Read more