దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ

ABN , First Publish Date - 2022-03-06T03:40:17+05:30 IST

బుచ్చి టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం సంగం వైపు వెళున్న ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న టోపీలు, కళ్లజోడు దుకాణం

దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ

 మహిళకు  తీవ్ర గాయాలు

బుచ్చిరెడ్డిపాళెం,మార్చి5: బుచ్చి టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం  సంగం వైపు వెళున్న ఓ లారీ  రోడ్డు పక్కనే ఉన్న  టోపీలు, కళ్లజోడు దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న కే శోభ  తీవ్రంగా గాయప డింది.  ప్రమాదానికి ముందు అప్పుడే దుకాణం తెరిచిన భర్త, భార్యను దుకాణంలో ఉంచి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఇంతలోనే  లారీ  దుకాణంపైకి దూసుకెళ్లింది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Read more