గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో రాష్ట్రం ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2022-12-08T23:38:33+05:30 IST

ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను నేడు జగన్‌రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా నివేదికలో కేంద్రం బట్టబయలు చేసిందని తెలుగు యువత జిలా ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్‌గౌడ్‌, మాజీ తెలుగు యువత కార్యదర్శి బాణా శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో రాష్ట్రం ప్రథమ స్థానం
మాట్లాడుతున్న తెలుగు యువత నాయకులు

సంగం, డిసెంబరు 8: ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను నేడు జగన్‌రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా నివేదికలో కేంద్రం బట్టబయలు చేసిందని తెలుగు యువత జిలా ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్‌గౌడ్‌, మాజీ తెలుగు యువత కార్యదర్శి బాణా శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక బంగ్లాలో సెంటర్‌లో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2021- 22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదికలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో అత్యధికంగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొందన్నారు. టీడీపీ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ గూయింగ్‌, ఎంజీఎన్‌, ఆర్‌ఈజీఎస్‌ పనుల వంటి వాటిలో ఏపీ నెం.1 స్థానంలో ఉంటే నేడు గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణాలో నెం.1 స్థానంలో ఉందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఏపీ నుంచి గంజాయి, మత్తు పదార్థాలు కొరియర్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా విదేశాలకు సైతం రవాణా జరుగుతోందని స్పష్టమవుతుందన్నారు. నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-08T23:38:35+05:30 IST