‘స్వచ్ఛత హీ సేవ’పై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2022-09-28T04:30:43+05:30 IST

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అమలు తీరుపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి పేర్కొన్నారు.

‘స్వచ్ఛత హీ సేవ’పై అవగాహన అవసరం
కంపోస్ట్‌ పిట్‌లో ఎరువును పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి

డీపీవో ధనలక్ష్మి

కావలి రూరల్‌, సెప్టెంబరు 27: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అమలు తీరుపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి పేర్కొన్నారు.  మండలంలోని చలంచర్ల పంచాయతీలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 722 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్ని గ్రామాలను పరిశుభ్రమైన గ్రామాలుగా రూపొందించుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ నిబంధనలపై 50 మైక్రాన్‌లకంటే సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించారు.  అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్పీడీవో సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకుడు శ్రీహరినాయుడు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Read more