గడువు మించొద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-22T03:46:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్ణీత గడువు మించకూడదని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

గడువు మించొద్దు : కలెక్టర్‌
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

కావలి, సెప్టెంబరు 21: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్ణీత గడువు మించకూడదని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కావలి ఆర్డీవో కార్యాలయ బుధవారం డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో జరుగుతున్న పనులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతి, భూముల రీ సర్వే, సచివాలయాలలో సర్వీసెస్‌ పురోగతి, జలజీవన్‌ మిషన్‌, స్వచ్ఛ సంకల్పం, ఉపాధిహామీ, సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాల నూతన నిర్మాణాలలో పురోగతి, భూసేకరణ ప్రక్రియ, ఓటరుకార్డుకు ఆధార్‌ అనుసంధానం తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మనబడి నాడు-నేడు పనులు నాణ్యతగా చేపట్టేలని  ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోపు డివిజన్‌ పరిధిలో మంజూరైన ఇళ్లన్నీ పూనాదుల స్థాయికి తీసుకురావాలన్నారు. పట్టణంలోని జగనన్న మెగా లేఅవుట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల రీసర్వే వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సచివాలయాలు, ఆర్బీకేల నూతన భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జలజీవన్‌ మిషన్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌ కూర్మనాథ్‌,  ఆర్డీవో శీనానాయక్‌, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో ధనలక్ష్మి, డ్వామా పీడీ వెంకట్రావు, డీఈవో రమేష్‌, హౌసింగ్‌ పీడీ వరప్రసాద్‌, సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఉషారాణి, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి కనకదుర్గా భవాని, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ హనుమకుమార్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


Read more