దిశ నిర్ధేశం లేకుండా..!

ABN , First Publish Date - 2022-05-19T04:33:54+05:30 IST

జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ నిర్వహించిన దిశ మెగా రిజిసే్ట్రషన మేళాకు స్టేషనల వారీగా టార్గెట్‌లు ఇచ్చారు. అర్బన పరిధిలో 3వేలు, రూరల్‌ పరిధిలో 2వేలు రిజిసే్ట్రషన్లు చేయాలని లక్ష్యం విధించారు.

దిశ నిర్ధేశం లేకుండా..!
నెల్లూరులో బజారుకు వచ్చిన మహిళలతో..

‘అడ్డదిడ్డంగా’ యాప్‌ మెగా రిజిసే్ట్రషన మేళా!

అర్బనలో 3వేలు, రూరల్‌లో 2వేల టార్గెట్‌

‘బాస్‌’ చెప్పారని పోలీసులంతా రోడ్డుపైకి

అవగాహన కల్పించకనే మొబైళ్లలో డౌనలోడ్‌


అసలు విధులు పక్కన పెట్టేశారు. జిల్లా పోలీస్‌ బాస్‌ చెప్పారని సీఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు అంతా రోడ్డుమీదకు వచ్చేశారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా వచ్చీపోయేవారిని ఆపి మరీ దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయించారు. ఆ యాప్‌ ఎలా వినియోగించాలో అవగాహన కల్పించకనే హడావిడిగా రిజిసే్ట్రషనను పూర్తి చేశారు. 


నెల్లూరు (క్రైం), మే 18 : జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ నిర్వహించిన దిశ మెగా రిజిసే్ట్రషన మేళాకు స్టేషనల వారీగా టార్గెట్‌లు ఇచ్చారు. అర్బన పరిధిలో 3వేలు, రూరల్‌ పరిధిలో 2వేలు రిజిసే్ట్రషన్లు చేయాలని లక్ష్యం విధించారు. దీంతో పోలీసు సిబ్బంది, అధికారులు అంతా రోజువారి విధులను పక్కనపెట్టి దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రహదారులు, ప్రధాన కూడళ్లలో వాహనాల్లో, నడిచి వెళుతున్న మహిళలను ఆపి వారి మొబైళ్లలో దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయించడమే లక్ష్యంగా విధులు నిర్వహించారు. మొత్తమ్మీద బుధవారం ఒక్కరోజే ఒక లక్షకుపైగా రిజిసే్ట్రషన్లు చేయించినట్లు సమాచారం.


ఇబ్బందులకు గురిచేస్తూ..


దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయడంలో కొందరు పోలీసులు మహిళలు, యువతులు, విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. బైక్‌లు, ఆటోలలో వెళుతున్న మహిళలను ఆపి తనిఖీలు చేస్తున్నట్లుగా బలవంతంగా వారితో దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయించారు. ఇందుకోసం గంటల తరబడి వారిని రోడ్లపైనే నిలిచోబెట్టారు. మరోవైపు కొన్నిచోట్ల ఫోన నెంబర్ల తీసుకోవడంపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు లక్ష్యసాధనే ధ్యేయంగా మగవారి మొబైళ్లలోనూ యాప్‌ను డౌనలోడ్‌ చేయించారు.


డౌనలోడ్‌ సరే అవగాహన...


దిశ యాప్‌ అంటే ఏదో మహిళలకు ఉపయోగ పడుతుందట అని విన్న వారే తప్ప ఆ యాప్‌పై పూర్తి అవగాహన కలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు. అంతో ఇంతో చదువుకున్న మహిళలకు సైతం ఆ యాప్‌ను ఏ విధంగా ఉపయోగించాలో తెలియని పరిస్థితి. పోలీసుశాఖ దిశ యాప్‌ డౌనలోడ్‌ చేయడంపై పెడుతున్న  శ్రద్ధ  అవగాహన కల్పించడంలో లేదనే విమర్శ ఉంది. అసలు ఈ ప్రక్రియను వలంటీర్లు, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న మహిళా పోలీసులకు అప్పగించి ప్రతి ఇంటికి వెళ్లి దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయించి రిజిసే్ట్రషన ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు అవగాహన కల్పిస్తే బాగుండేదని అంటున్నారు.


బాస్‌ చెప్పారనీ..


జిల్లా ఎస్పీగా సీహెచ విజయరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్పీ స్పందనలో ఫిర్యాదుదారులకు భోజన ఏర్పాట్లు, మజ్జిగ చలివేంద్రం, స్పందన ఫిర్యాదులపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఎస్పీ పిలుపునిచ్చిన దిశ మెగా రిజిసే్ట్రషన మేళాలో కొందరు పోలీసులు, సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రజల్లో అసహనం వ్యక్తమైంది.

 

ఎస్పీ కృతజ్ఞతలు


మెగా రిజిసే్ట్రషన మేళాలో భాగస్వాములైన వారందరికీ ఎస్పీ విజయరావు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం నగరంలోని స్వర్ణ వేదికలో జరిగిన మెగా డ్రైవ్‌లో ఎస్పీ మాట్లాడుతూ లక్ష రిజిస్ర్టేషన్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు  డి హిమవతి,  కె చౌడేశ్వరి, శ్రీనివాసరావు, ఎస్‌బి డీఎస్పీ కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-19T04:33:54+05:30 IST