-
-
Home » Andhra Pradesh » Nellore » different ill in model colony-MRGS-
-
మోడల్ కాలనీలో అంతుచిక్కన వ్యాధి
ABN , First Publish Date - 2022-09-12T05:10:34+05:30 IST
ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని మోడల్ ఎస్టీ కాలనీలోని కొన్ని కుటుంబాలు అంతుచిక్కని వ్యాధి ప్రబలి అల్లాడుతున్నాయి.

ప్రజల అవస్థలు
ఆత్మకూరు, సెప్టెంబరు 11 : ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని మోడల్ ఎస్టీ కాలనీలోని కొన్ని కుటుంబాలు అంతుచిక్కని వ్యాధి ప్రబలి అల్లాడుతున్నాయి. కాలనీలో 50 కుటుంబాలకుపై బడి నివాసం ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల వారికి ఒళ్లంతా మచ్చలు, గుల్లలతో విపరీతమైన దురద ఏర్పడి అవస్థలు పడుతున్నారు. వ్యాధిగ్రస్థులకు ఆకలి నశించడం, నిద్రలేమి, చిక్కిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో ఇటీవల ఒకరు మరణించగా మరో 20 మంది ఈ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వ్యాధి ఎప్పుడూ చూడలేదని అంటువ్యాధిలా ఒకరినుంచి మరొకరికి ప్రబులుతోందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.