కసుమూరులో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-06-13T04:54:13+05:30 IST

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ర్టాలతోపాటు మన రాష్ట్ర నలమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మస్తాన్‌ వలీ దర్గాను సందర్శించారు.

కసుమూరులో భక్తుల రద్దీ

వెంకటాచలం, జూన్‌ 12 : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ర్టాలతోపాటు మన రాష్ట్ర నలమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మస్తాన్‌ వలీ దర్గాను సందర్శించారు. కొందరు భక్తులు షాఫా బావిలో పుణ్య స్నానాలు ఆచరించి మస్తాన్‌ స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించగా మరికొందరు అన్నదానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మస్తాన్‌ స్వామి దర్గాను పూలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

Updated Date - 2022-06-13T04:54:13+05:30 IST