కనుల పండువగా దేవీ నవరాత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-29T04:23:21+05:30 IST

దేవీ నవరాత్రోత్సవాలు బుధవారం పట్టణంలో కనుల పండువగా జరిగాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి.

కనుల పండువగా దేవీ నవరాత్రోత్సవాలు
మహాగౌరీ అలంకారంలో కళుగోళశాంభవి

కావలిటౌన్‌, సెప్టెంబరు 28: దేవీ నవరాత్రోత్సవాలు బుధవారం పట్టణంలో కనుల పండువగా జరిగాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. గ్రామ దేవత కళుగోళశాంభవి మహాగౌరీగా, పాతూరులోని దుర్గాభ్రమరాంభిక అన్నపూర్ణాదేవిగా, విష్టాలయంలో రాజ్యలక్ష్మి ధైర్యలక్ష్మిగా, వడ్డెపాలెంలోని కనకదుర్గా అమ్మవారు గాయత్రీదేవీగా, కొత్తబజారులోని కన్యకాపరమేశ్వరీ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Read more