పట్టభద్రులంతా టీడీపీ వైపే

ABN , First Publish Date - 2022-10-07T04:44:17+05:30 IST

మూడేళ్లలో నిరుద్యోగులకు, రాష్ట్రానికి వైసీపీ చేసిన అన్యాయాన్ని పట్టభద్రులు గుర్తించారని, అందుకే వారంతా టీడీపీ వైపే ఉన్నారని ఆ పార్టీ సర్వేపల్లి నియోజ కవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

పట్టభద్రులంతా టీడీపీ వైపే
మాట్లాడుతున్న సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

 సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

పొదలకూరు, అక్టోబరు 6 : మూడేళ్లలో నిరుద్యోగులకు, రాష్ట్రానికి వైసీపీ చేసిన అన్యాయాన్ని పట్టభద్రులు గుర్తించారని, అందుకే వారంతా టీడీపీ వైపే ఉన్నారని ఆ పార్టీ సర్వేపల్లి నియోజ కవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కల్యాణ మండపంలో గురువారం మండల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు వెరిఫికేషన్‌ తదితర అంశాలపై వార్డు ఇన్‌చార్జులు, నేతలతో చర్చించారు. ప్రతి గ్రామంలో 2019 నవంబరు 1నాటికి డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరితో ఓటుకు దరఖాస్తు చేయించాలని  సూచించారు. విద్యావంతుడు, కష్టపడి పని చేసే తత్వం కలిగిన కంచర్ల శ్రీకాంత్‌ గెలుపును అందరూ బాధ్యతగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జుననాయుడు, నాయకులు కోడూరు భాస్కర్‌రెడ్డి, కలగట్ల సందీప్‌, తల్లిక ప్రసాద్‌, డేగ హరినారాయణ, సాదం గిరీష్‌, రోహిత్‌, ఆదాల మురళీరెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read more