బడికోసం దీక్షల కొనసాగింపు

ABN , First Publish Date - 2022-09-11T03:54:53+05:30 IST

మండలంలోని తెగచెర్ల కాలనీ వాసులు బడి కోసం చేస్తున్న సామూహిక ఆమరణ దీక్షలు శనివారం నాటికి నాలుగవ రోజుకు చే

బడికోసం దీక్షల కొనసాగింపు
తెగచెర్లలో చేస్తున్న సామూహిక ఆమరణ దీక్షలు

రాపూరు, సెప్టెంబరు 10: మండలంలోని తెగచెర్ల కాలనీ వాసులు బడి కోసం చేస్తున్న సామూహిక ఆమరణ దీక్షలు శనివారం నాటికి నాలుగవ రోజుకు చేరాయి. పదిమంది కాలనీ వాసులు ఈ దీక్షలు చేస్తున్నారు.  విలీన ప్రక్రియను ఆపివేసి యథాతథంగా 3,4,5 తరగతులను కొనసాగించే వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు.  సోమవారం జిల్లా కలెక్టరును కలుస్తామని, న్యాయం జరగకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికుడు పెంచలయ్య తెలిపారు. 


Read more