నయనానందకారం... అమ్మవారి దర్శనం

ABN , First Publish Date - 2022-09-30T05:15:19+05:30 IST

నియోజకవర్గంలో దేవీనవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

నయనానందకారం... అమ్మవారి దర్శనం
బాలత్రిపురసుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కామాక్షిదేవి

ఆత్మకూరు, సెప్టెంబరు 29 :  నియోజకవర్గంలో దేవీనవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.  ఆత్మకూరు పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో గురువారం  ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, శ్రీవాసవీ అష్టోత్తర పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. అలాగే శివాలయంలో, ఉత్తర బలిజవీధిలో వెలసి ఉన్న శ్రీజ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి ఖడ్గమాల విశేషపూజలు, ఆలయ కలశస్థాపన, కుంకుమార్చన, అభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు.   

బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో కామాక్షిదేవి

సంగం: స్థానిక క్షామాక్షిదేవి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం కామాక్షిదేవి బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. కార్యక్రమంలో కాకు రంగమ్మ కుమారుడు మధుసూదన్‌ యాదవ్‌ ఉభయకర్తగా వ్యవహరించారు. 


గంగమ్మదేవికి డ్రైఫ్రూట్స్‌తో అలంకరణ

పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న పాలేటి గంగమ్మదేవి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం గంగమ్మదేవి మూలవిరాట్‌ను డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. 
Read more