విజయదశమితో ముగిసిన దసరా వేడుకలు

ABN , First Publish Date - 2022-10-07T04:36:48+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, మండలంలోని జొన్నవాడ, రేబాల తదితర గ్రామాల ఆలయాల్లో నిర్వహించిన దసరా వేడుకలు విజయదశమితో ముగిశాయి.

విజయదశమితో ముగిసిన దసరా వేడుకలు
బుచ్చి నగర పంచాయతీలో గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత శీతలాంబ

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు6: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, మండలంలోని జొన్నవాడ, రేబాల తదితర గ్రామాల ఆలయాల్లో నిర్వహించిన దసరా వేడుకలు విజయదశమితో ముగిశాయి. ఈ సందర్భంగా బుచ్చిలోని కామాక్షికాలనీలో శీతలాంబ, రేబాలలోని పుట్టాలమ్మ గ్రామ దేవతలు గ్రామోత్సవాలతో గురువారం ఉదయం వరకు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జొన్నవాడ ఆలయంలో బుధవారం శమీపూజ,ఏకాంతసేవతో దసరా వేడుకలు ముగిశాయి. 

Read more