చంద్రబాబు సీఎం కావాలని సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2022-07-08T05:04:06+05:30 IST

ఆ యువకుడిది విజయవాడ. పేరు వెంకటకృష్ణ. రాష్ట్రంలో అరాచక పాలనతో విసుగెత్తి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌

చంద్రబాబు సీఎం కావాలని సైకిల్‌ యాత్ర

 సంగం, జూలై 7: ఆ యువకుడిది విజయవాడ. పేరు వెంకటకృష్ణ. రాష్ట్రంలో అరాచక పాలనతో విసుగెత్తి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర ప్రారంభించాడు. ఎనిమిది రోజుల కిందట విజయవాడలో బయలుదేరగా గురువారం సంగం చేరుకున్నాడు. ఈ విలేకరులతో మాట్లాడుతూ  రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.. చంద్రబాబు రావాలి అన్న నినాదంతో  రాష్ట్ర మంతటా సైకిల్‌ యాత్ర చేపట్టాలని భావించానని తెలిపారు. ఈ యాత్ర ఆత్మకూరు మీదుగా రాయలసీమలోకి ప్రవేశిస్తుందని, హిందూపురం వెళ్లి అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసి అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిసి బాబు సీఎం అయ్యే వరకు రాష్ట్రమంతటా సైకిల్‌ యాత్ర చేయడమే లక్ష్యమని వివరించారు.

Read more