ఆర్వోబీ వంతెనపై సీపీఎం ఆందోళన

ABN , First Publish Date - 2022-09-28T04:45:02+05:30 IST

ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై గుంతలను పూడ్చాలని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఆర్వోబీ వంతెనపై సీపీఎం ఆందోళన
ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై ఆందోళన చేస్తున్న సీపీఎం

కావలిటౌన్‌, సెప్టెంబరు 27: ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై గుంతలను పూడ్చాలని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి ఉదయగిరి బ్రిడ్జిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. బ్రిడ్జిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ఇనుమ సువ్వలు బయటపడి ప్రమాదభరితంగా మారిందన్నారు. ఏడాదినుంచి ఇదే దుస్థితి ఉందని అయినా పాలకులు అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు మధుసూదన్‌రావు, కృష్ణమోహన్‌, బీ కృష్ణయ్య, పీ అమర్‌కుమార్‌, ఓ రమేష్‌, సీఐటీయు నేతుల జాన్‌, పీ శ్రీనివాసులు, బాబి, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more