ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-06-08T03:16:49+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పిలుపు నిచ్చారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య అధ్యక్షతన నియోజకవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈక్రమంలో జనంలోకి సీపీఎం కార్యక్రమం చేపట్టి గ్రామగ్రామాన సర్వే చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టనున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతుల మెడకు ఉరితాళ్లే దిక్కవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కాకు విజయమ్మ, నాయకులు అజయ్‌కుమార్‌, కోడె రమణయ్య, గుజ్జుల మల్లికార్జున, ఫరుద్దీన్‌బాషా, భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, నాయబ్‌, కామాక్షమ్మ, ప్రజా, మహిళా సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T03:16:49+05:30 IST