తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌రూం

ABN , First Publish Date - 2022-09-12T04:48:53+05:30 IST

వర్షాలు, వరదల నేపథ్యంలో తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌రూము ఏర్పాటు చేసినట్టు ఆదివారం తహసీల్దారు ఓ ప్రకటనలో తెలిపారు.

తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌రూం

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు11: వర్షాలు, వరదల నేపథ్యంలో తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌రూము ఏర్పాటు చేసినట్టు ఆదివారం తహసీల్దారు ఓ ప్రకటనలో తెలిపారు. సోమశిల జలాశయం నుంచి పెన్నానదికి విడుదలైన వరదనీటి ప్రవాహంపై మండలంలో పెన్నాపరీవాహక ప్రాంతంలోని మినగల్లు, జొన్నవాడ, కాళయకాగొల్లు, శ్రీరంగరాజపురం, దామరమడుగు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  24గంటలూ రెవెన్యూ సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 వరకు విధుల్లో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more