-
-
Home » Andhra Pradesh » Nellore » commisioner and mayor as like as jagan-MRGS-AndhraPradesh
-
జగన్ మాదిరే నగర కమిషనర్, మేయర్
ABN , First Publish Date - 2022-07-06T04:38:08+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితమైనట్లు నెల్లూరు నగర కమిషనర్, మేయర్లు సైతం కార్యాలయాలకే పరిమితమయ్యారని టీడీపీ సీనియర్ మహిళా నేత తాళ్లపాక అనూరాధ విమర్శించారు.

టీడీపీ సీనియర్ మహిళా నేత తాళ్లపాక అనూరాధ
నెల్లూరు(వ్యవసాయం), జూలై 5 : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితమైనట్లు నెల్లూరు నగర కమిషనర్, మేయర్లు సైతం కార్యాలయాలకే పరిమితమయ్యారని టీడీపీ సీనియర్ మహిళా నేత తాళ్లపాక అనూరాధ విమర్శించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన ఐఏఎస్ మహిళ జాహ్నవి కార్యాలయానికి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. మేయర్ స్రవంతి రూరల్ పరిధికే పరిమితమైందని విమర్శించారు. నగరం కూడా కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందని గుర్తుచేశారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించబోమని, కమిషనర్, మేయర్ సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఇళ్లకే పరిమితమైన కార్పొరేటర్లు వారి విధులు, బాధ్యతలను గుర్తు చేసుకోవాలని సూచించారు. వైసీపీ అధికారంలోకొచ్చి మూడేళ్లు గడుస్తున్నా నగర, రూరల్ ఎమ్మెల్యేలు కనీసం 10శాతం పనులను సైతం పూర్తి చేయలే కపోయారని విమర్శించారు. మాజీ మంత్రి నారాయణ, మాజీ మేయర్ అజీజ్ హయాంలో నగరంలో వేలకోట్లతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతులనూ చేయించలేకపోతున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు సాబీర్‌ఖాన్, జలదంకి సుధాకర్, విజయ, దత్తు, శైలేందర్‌బాబు, ఉక్కు భాస్కర్, వేణు తదితరులు పాల్గొన్నారు.