కలెక్టర్‌ సచివాలయాల సందర్శన

ABN , First Publish Date - 2022-07-06T03:16:23+05:30 IST

మండలంలోని సచివాలయాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఉలవపా

కలెక్టర్‌ సచివాలయాల సందర్శన
సచివాలయ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, పక్కన ఆర్డీవో సుబ్బారెడ్డి

ఉలవపాడు, జూలై 5 : మండలంలోని సచివాలయాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఉలవపాడు-2,3 సచివాలయా లను సందర్శంచి సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓటీఎస్‌ రిజిస్ర్టేషన్‌ బాండ్లు ఎంతమంది లబ్ధిదారులకు అందించారని అడిగారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్‌, రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించగా, ఆర్డీవో సుబ్బారెడ్డి సమాధానమిస్తూ మండలంలో నిర్మాణ దశలో ఉన్న పక్కా గృహాల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ నుంచి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పత్రాలు అందాయా.. లేదా.. అని అడిగారు.   కలెక్టర్‌ వెంట  ఎంపీడీవో చెంచమ్మ, తహసీల్దార్‌గా పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిన కే సంజీవరావు,  రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.


Read more