సీఎం సహాయనిఽధి చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-27T03:05:14+05:30 IST

నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖ్‌ర్‌రెడ్డి సీఎం సహాయ

సీఎం సహాయనిఽధి చెక్కుల పంపిణీ
చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి, సెప్టెంబరు 26: నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖ్‌ర్‌రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక వైసీపీ క్యాంపు కార్యాలయంలో కలిగిరికి చెందిన చెంచమ్మకు రూ.40 వేలు, ఉదయగిరి మండలం నేలటూరుకు చెందిన పెండ్యాల సుబ్బరాయుడు రూ.15 వేలు, జలదంకికి చెందిన మలిశెట్టి రవికుమార్‌కు రూ.60 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


--------


Read more