టీడీపీ పటిష్టతకు సీనియర్‌ సిటిజన్స్‌ సేవలు అవసరం

ABN , First Publish Date - 2022-11-07T22:29:55+05:30 IST

టీడీపీ పటిష్టతకు సీనియర్‌ సిటిజన్స్‌ సేవలు అవసరమని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు.

టీడీపీ పటిష్టతకు సీనియర్‌ సిటిజన్స్‌ సేవలు అవసరం
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు

ఉలవపాడు, నవంబరు 7 : టీడీపీ పటిష్టతకు సీనియర్‌ సిటిజన్స్‌ సేవలు అవసరమని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు. ఉలవపాడులోని సీనియర్‌ సిటిజన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని టీడీపీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం, అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో దామచర్ల సుబ్బులు, కారుమంచి పెనుకొండయ్య, ఆవుల నరసింహరావు, పొదిలి శ్రీనివాసులు, నత్తా నారయ్య, ఎల్‌ లక్ష్మణరావు, కృష్ణారెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T22:29:55+05:30 IST

Read more