11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-07-06T03:20:05+05:30 IST

ఈనెల 11న జరగబోయే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె
సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు

కావలిటౌన్‌, జూలై 5: ఈనెల 11న జరగబోయే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జీ కిషోర్‌ అధ్యక్షతన సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పె పెంచలయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మల్లి అంకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన పర్మినెంట్‌ హామీ విస్మరించారన్నారు. ఆప్కాస్‌ విధానం తీసుకొచ్చి కార్మికుల పనిభారం పెంచారని ఈఎ్‌సఐ కార్మికులకు ఉపయోగపడడంలేదని పీఎఫ్‌ కార్మికులకు సక్రమంగా అందడంలేదన్నారు. కార్మిక సంఘాలు సమస్యలు పరిష్కరించమని అనేకసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పాలకులు పెడచెవిన పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11 నుంచి  కార్మికులు నిరవధిక సమ్మెకు దిగనున్నారన్నారు. సమావేశంలో వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ఆనందరావు, టీ మాలకొండయ్య, వై రవి, పోలయ్య, ఏఐటీయుసీ నేతలు వై ప్రభావతి, రాజేష్‌, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T03:20:05+05:30 IST