చౌదరిపాళెంలో కూలిన పొగాకు బ్యారెన్లు

ABN , First Publish Date - 2022-11-24T22:22:14+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు బుధవారం రాత్రి కావలి మండలం చౌదరిపాలెం లో మూడు పొగాకు బ్యారెన్లు కూలిపోయాయి.

చౌదరిపాళెంలో కూలిన పొగాకు బ్యారెన్లు
బ్యారెన్‌లో ధ్వంసమైన వస్తువులు

ఆదుకోవాలంటున్న రైతులు

కావలి రూరల్‌, నవంబరు24: ఇటీవల కురిసిన వర్షాలకు బుధవారం రాత్రి కావలి మండలం చౌదరిపాలెం లో మూడు పొగాకు బ్యారెన్లు కూలిపోయాయి. వర్షాలకు గోడలు నాని పోవడంతో గ్రామంలోని కంచర్ల సుబ్బరాయుడు, మండవ వెంకటేశ్వర్లు, మద్దినేని వసంత లకు చెందిన పొగాకు బ్యారెన్లు కూలిపోయాయి. దీంతో బ్యారెన్టలోని కర్రలు, టైర్లు, పొయ్యలు ధ్వంసం అయ్యాయి. దీంతో తమకు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయం కావటంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. పొగాకు బోర్డు అధికారులు పరిశీలించి తమకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.

---------

Updated Date - 2022-11-24T22:22:14+05:30 IST

Read more