వరి విత్తనాల షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీ

ABN , First Publish Date - 2022-09-30T04:56:43+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గురువారం విజిలెన్స్‌ అధికారులు పలు వరి విత్తనాల దుకాణాల్లో తనిఖీ చేశారు.

వరి విత్తనాల షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీ
ఓ విత్తనాల దుకాణంలో స్టాకు రిజిస్టర్లు పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు 29: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గురువారం విజిలెన్స్‌ అధికారులు పలు వరి విత్తనాల దుకాణాల్లో తనిఖీ చేశారు. బుచ్చిలోని సంఘమిత్ర, మోహన్‌ సీడ్స్‌ దుకాణాల్లో వరి విత్తనాల స్టాకును పరిశీలించారు. స్టాకు రిజిస్టర్‌కు, స్టాకుకు లెక్కలు, ప్రన్సిపల్‌ (పీసీ) సర్టిఫికెట్‌లు సరిగా లేకపోవడంతో స్టాకు ప్రకారం తేలే వరకు విత్తనాల విక్రయాలను నిలిపేశారు. లెక్కలు తేలాక మండల వ్యవసాఽయాధికారి ఆదేశాల మేరకు విక్రయించుకోవాలని తెలిపినట్టు వ్యవసాయాఽఽధికారి పి.సురేంద్రరెడ్డి తెలిపారు. సంఘమిత్ర షాపులో రూ.5లక్షలా 40వేలా 380 విలువైన కేఎన్‌ఎం 1638 రకం విత్తనాలు 411 క్వింటాళ్లు, మోహన్‌ సీడ్స్‌లో రూ.40,600 విలువ చేసే కేఎన్‌ఎం 1638రకం 14.25 క్వింటాళ్లు విత్తనాల విక్రయాలు నిలిపివేసినట్టు తెలిపారు.


Updated Date - 2022-09-30T04:56:43+05:30 IST