చానల్‌ రిపోర్టర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-09-14T05:02:48+05:30 IST

పోలీసులు వేధిస్తున్నారంటూ రాపూరు మండలానికి చెందిన ఒక చానల్‌ రిపోర్టురు మంగళవారం పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

చానల్‌ రిపోర్టర్‌ ఆత్మహత్యాయత్నం

పోలీసులు వేధిస్తున్నారని సెల్ఫ్‌ వీడియో

రాపూరు, సెప్టెంబరు 13:  పోలీసులు వేధిస్తున్నారంటూ రాపూరు మండలానికి చెందిన ఒక చానల్‌ రిపోర్టురు మంగళవారం పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తాను మండలంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వార్తలు  వెలుగులోకి తెచ్చానని నాయకుల ప్రమోయంతో పోలీసులు వేధిస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించాడు. పురుగుల మందు తాగిన రిపోర్టురును స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. ఎలాంటి  ప్రాణాపాయం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంకటగిరి జాతర విధుల్లో ఉన్న సీఐ నాగ మల్లేశ్వరావుకు సమాచారం  అందడంతో రాపూరుకు చేరుకుని బాధితుడు, పోలీసులను వేర్వేరుగా విచారణ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ  బాధితుడు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల  ఫిర్యాదు మేరకు గతంలో అతడిపై  పోలీసు కేసులు  నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పోలీస్‌స్టేషన్‌లో తక్షణమే  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్సైను ఆదేశించినట్లు సమాచారం.

Read more