కరేడు చెరువు పనులకు భూమిపూజ

ABN , First Publish Date - 2022-09-09T03:06:45+05:30 IST

మండలంలోని కరేడు చెరువు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి భూమిపూజ చేశారు. అలా

కరేడు చెరువు పనులకు భూమిపూజ
చెరువు పనుల ప్రారంభానికి పూజ చేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

ఉలవపాడు, సెప్టెంబరు 8: మండలంలోని కరేడు చెరువు అభివృద్ధి పనులకు గురువారం  ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి భూమిపూజ  చేశారు. అలాగే చాకిచర్లలోని జమ్ముల, గోగుల, సీతమ్మ చెరువుల అభివృద్ధికి  నిధులు మంజూరు అయినట్లు కందుకూరు ఇరిగేషన్‌ డీఈ కే చెరియన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ లక్ష్మీరెడ్డి, ఎస్సై టీ త్యాగరాజు, ఆయకట్టు రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Read more