-
-
Home » Andhra Pradesh » Nellore » car deekoni vuddi maranam-MRGS-AndhraPradesh
-
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ABN , First Publish Date - 2022-09-30T03:40:58+05:30 IST
ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న గోసు వెంకట కృష్ణమోహన్ (62)ను బోలెరో వాహనం ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు

గుడ్లూరు, సెప్టెంబరు 29 : ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న గోసు వెంకట కృష్ణమోహన్ (62)ను బోలెరో వాహనం ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని చేవూరు సమీపాన ఉన్న జాతీయరహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కావలికి చెందిన వెంకట కృష్ణమోహన్ చేవూరులో బంధువుల ఇంట జరిగే కార్యక్రమానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. జాతీయరహదారిపై నుంచి చేవూరు రోడ్డు వైపునకు మలుపు తిరుగుతున్న సమయంలో చెన్నై నుంచి విజయవాడకు వెళుతున్న బోలెరో వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా, కావలికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నెల్లూరుకి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతుడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది.
--------