మద్యం, గుట్కాల పట్టివేత

ABN , First Publish Date - 2022-10-09T04:57:40+05:30 IST

మండలంలోని కృష్ణాపురం బీసీ కాలనీలో సెబ్‌ సీఐ నరహరి తన సిబ్బందితో కలిసి శనివారం దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాలు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం, గుట్కాల పట్టివేత
పట్టుబడిన మద్యం, గుట్కాలు, వ్యక్తితో సెబ్‌ అధికారులు

మర్రిపాడు, అక్టోబరు 8: మండలంలోని కృష్ణాపురం బీసీ కాలనీలో సెబ్‌  సీఐ నరహరి తన సిబ్బందితో కలిసి శనివారం దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాలు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు  పుచ్చకట్ల వెంకటేశ్వర్లుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం, గుట్కాల విలువ సుమారు రూ. 3.5లక్షల ఉంటుందని సీఐ తెలిపా రు. కృష్ణాపురం బెల్టు దుకాణం ద్వారా వాటిని సరఫరా చేసినట్టు అధికారులకు సమాచారం వచ్చింది.

Read more