బాక్సింగ్‌ క్రీడా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-13T22:51:46+05:30 IST

పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం పెనుబల్లి జడ్పీ హైస్కూల్లో క్రీడా ప్రాంగళణంలో 14, 17 ఏళ్లలోపు బాలురు, బాలబాలికలకు బాక్సింగ్‌ క్రీడా జిల్లా జట్లు ఎంపికలు జరిగాయి.

బాక్సింగ్‌ క్రీడా జట్ల ఎంపిక
బాక్సింగ్‌కు ఎంపికైన బాలుర జిల్లా జట్లు

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు13: పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం పెనుబల్లి జడ్పీ హైస్కూల్లో క్రీడా ప్రాంగళణంలో 14, 17 ఏళ్లలోపు బాలురు, బాలబాలికలకు బాక్సింగ్‌ క్రీడా జిల్లా జట్లు ఎంపికలు జరిగాయి. ఎంపికైన వారు జనవరిలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. జిల్లా బాక్సింగ్‌ కోచ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలకు పలు మండలాలనుంచి సుమారు 150 మంది బాలబాలికలు, బాలురు హాజరయ్యారు. అతిథులుగా జిల్లా ప్రాధికార క్రీడాసంస్థ అధికారి ఆర్‌కే. యతిరాజ్‌, మండల విద్యాఽశాఖాధికారి ఎం. ధిలీప్‌ కుమార్‌, సర్పంచు ఊడా పెంచలయ్య, విద్యాకమిటీ చైర్మన్‌ కే. కృష్ణయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఎం అనిల్‌కుమార్‌, పలు పాఠశాలల నుంచి ఆరుగురు పీడీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T22:51:46+05:30 IST

Read more