-
-
Home » Andhra Pradesh » Nellore » bommi appointed as chittoor constituency incharge-MRGS-AndhraPradesh
-
చిత్తూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా బొమ్మి
ABN , First Publish Date - 2022-09-30T04:47:58+05:30 IST
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్రను అధిష్ఠానం నియమించింది.

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 29 : చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్రను అధిష్ఠానం నియమించింది. తోటపల్లిగూడూరు టీడీపీ నాయకులు బొమ్మిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులుగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇప్పుడు అదనంగా చిత్తూరు టీడీపీ పరిశీలకులుగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొణతం రఘుబాబు, సర్వేపల్లి నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి మన్నెం జితేంద్ర, తోటపల్లిగూడూరు మండల ప్రధాన కార్యదర్శి ముత్యాలు శ్రీనివాసులు, యువత ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు, ఇసుకపాలెం సర్పంచ్ ఇంగిలాల చైతన్యకుమార్, గోపిరెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.