బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి

ABN , First Publish Date - 2022-10-13T05:10:13+05:30 IST

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు కాకు విజయలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేతలు

ఆత్మకూరు, అక్టోబరు 12 : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు కాకు విజయలక్ష్మి,  రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. స్థానిక త్రికోటేశ్వర కల్యాణ మండపంలో బుధవారం బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేపట్టవలసిన కార్యాచరణ, వ్యూహాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కుడుముల సుధాకర్‌రెడ్డి, బత్తల కృష్ణయ్య, కుంకు బాలయ్యనాయుడు, నాగరాజారెడ్డి, వాసిపల్లి సుధాకర్‌రెడ్డి, కట్టా మహేశ్వరరెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపల్లి భరత్‌రెడ్డి  పాల్గొన్నారు.

Read more