ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవటం దారుణం

ABN , First Publish Date - 2022-07-19T04:03:56+05:30 IST

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పథకం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా పంపిణీ చేయకపోవటం దారుణమని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కందుకూరి వెంకటసత్యనారాయణ పేర్కొన్నారు.

ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవటం దారుణం
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు

ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా

కావలి, జూలై 18: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పథకం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా పంపిణీ చేయకపోవటం దారుణమని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కందుకూరి వెంకటసత్యనారాయణ పేర్కొన్నారు. బియ్యం పంపిణీలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ సూర్యనారాయణ సింగ్‌కు వినతిపత్రం అందచేశారు. వెంటనే ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే. బ్రహ్మానందం, నేతలు వీవీ రంగారెడ్డి, సీవీసీ సత్యం, వీ. సుదీర్‌, మంద కిరణ్‌కుమార్‌, సుందరశిట్టి సుజీ, కుట్టుబోయిన మాధవరావు, విష్ణుతేజరెడ్డి, మర్రి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more