భగత్‌సింగ్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-09-29T05:23:58+05:30 IST

పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.

భగత్‌సింగ్‌కు ఘన నివాళి
నివాళులు అర్పిస్తున్న జనసేన నాయకులు

ఆత్మకూరు, సెప్టెంబరు 28 : పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకమని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం పవనన్న  ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్టీ పరిధిలోని నెల్లూరుపాళెం, ఎస్సీకాలనీలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.  

Read more