బంగారం ఇస్తామని మోసగించినట్లు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-08-18T03:50:28+05:30 IST

తక్కువ ధరకు పాత బంగారం ఇస్తామని రూ.45 లక్షలు తీసుకుని మోసగించారని విశాఖపట్నంకు చెందిన కొత్తపల్లి సృజన బుధ

బంగారం ఇస్తామని మోసగించినట్లు ఫిర్యాదు

కావలి రూరల్‌, ఆగస్టు17: తక్కువ ధరకు పాత బంగారం ఇస్తామని రూ.45 లక్షలు తీసుకుని మోసగించారని విశాఖపట్నంకు చెందిన కొత్తపల్లి సృజన బుధవారం కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు, కావలి తుఫాన్‌నగర్‌కి చెందిన దేవరకొండ సుధీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు మనోహర్‌రెడ్డిలు కలసి తక్కువ ధరకు పాత బంగారం ఇస్తున్నట్లు  పెద్దాపురానికి కత్తుల రాము, కాకినాడకు చెందిన జోగినాఽథం, విజయవాడకు చెందిన రియాజ్‌ల ద్వారా తెలుసుకున్నాడు. దీంతో రాము ఈ విషయాన్ని తన బంధువైన సృజనకు తెలియజేశాడు. దీంతో తక్కువ ధరకు బంగారం వస్తుందని సృజన ఆశ పడింది. దీంతో  పైవారందరూ కలసి గత జూలైలో సృజన వద్ద నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారు. అప్పుటి నుంచి  బంగారం రేపు  ఇస్తాం.. మాపు ఇస్తామని చెబుతూ  కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

-----------------

Read more