సోమశిల అటవీ ప్రాంతంలో మంటలు

ABN , First Publish Date - 2022-08-17T03:18:24+05:30 IST

సోమశిల జలాశయం కుడివైపు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. కలువాయి రోడ్డులోని పరమా

సోమశిల అటవీ ప్రాంతంలో మంటలు
అటవీ ప్రాంతంలో రేగుతున్న మంటలు

అనంతసాగరం, ఆగస్టు 16: సోమశిల జలాశయం కుడివైపు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. కలువాయి రోడ్డులోని పరమానందస్వామి ఆశ్రమం పైతట్టు ఉన్న కొండల్లో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడంతో మంటలు వ్యాపించాయి. దీంతో వృక్షాలు బూడిదగా మారాయి. సోమశిల పరిసర ప్రాంతాల్లో మంటలు చెలరేగడం సర్వసాధారణమైంది. సంబంధిత అదికారులు చొరవ చూపి అటవీ ప్రాంతంలో అగ్గి  రగలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Read more