గౌరవవేతనం చెల్లించాలని ఆశావర్కర్ల ధర్నా

ABN , First Publish Date - 2022-06-08T05:01:41+05:30 IST

తమకు గౌరవవేతనం రూ.15వేలు చెల్లించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంగళవారం ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎదుట ధర్నా చేశారు.

గౌరవవేతనం చెల్లించాలని ఆశావర్కర్ల ధర్నా
ధర్నా చేస్తున్న ఆశావర్కర్లు

కోవూరు, జూన్‌ 7: తమకు  గౌరవవేతనం రూ.15వేలు చెల్లించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంగళవారం ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎదుట ధర్నా చేశారు. ఆశావర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ప్రాణాంతక కొవిడ్‌ నివారణకు ప్రాణాలకు తెగించి ఆశావర్కర్లు సేవలందించారన్నారు. ఆశావర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీసవేతన చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం వైద్య అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనకు ఆశావర్కర్లు తలారి. వరలక్ష్మి, శోభ, కల్పన, లలిత, సుమన, రమణి వహించారు.

Read more