అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-10-01T04:54:28+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రోడ్డి పేర్కొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి

 ఆత్మకూరు, సెప్టెంబరు 30 : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రోడ్డి పేర్కొన్నారు. మండలంలోని వాశిలిలో శుక్రవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదిక కావాలని సూచించారు.  కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Read more