లైబ్రరీ సైన్స్‌ ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T05:04:40+05:30 IST

ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న డిజిటల్‌ లైబ్రరీలో గ్రంథపాలకులు, పౌరగ్రంథాలయాల్లో ఖాళీలను అర్హత కలిగిన లైబ్రరీ సైన్స్‌ వారితో శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ఏపీ గ్రంఽథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావును ఏపీ గ్రంఽథాలయ నిరుద్యోగ జేఏసీ నేతలు కోరారు.

లైబ్రరీ సైన్స్‌ ఖాళీలను భర్తీ చేయాలి
గ్రంఽథాలయ చైర్మన్‌కు వినతిపత్రం అందజేస్తున్న జేఏసీ నేతలు

 గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌కు వినతి

నెల్లూరు (విద్య) అక్టోబరు 1  : ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న డిజిటల్‌ లైబ్రరీలో గ్రంథపాలకులు, పౌరగ్రంథాలయాల్లో ఖాళీలను అర్హత కలిగిన లైబ్రరీ సైన్స్‌ వారితో శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ఏపీ గ్రంఽథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావును ఏపీ గ్రంఽథాలయ నిరుద్యోగ జేఏసీ నేతలు కోరారు. శనివారం నెల్లూరు రేబాలవారివీధిలోని జిల్లా గ్రంఽథాలయానికి వచ్చిన ఆయనకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లుగా గ్రంథపాలక నిరుద్యోగులు సుమారు లక్షమంది వరకు ఉన్నారన్నారు. వారంతా ఉపాధి లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వారిని గుర్తించి ప్రభుత్వం నిర్మించే డిజిటల్‌ లైబ్రరీల్లో సర్వీస్‌రూల్స్‌ను క్రియేట్‌ చేసి నియామకాలు చేపట్టాలన్నారు. జిల్లా గ్రంఽథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న 1500 పోస్టులతో పాటు జూనియర్‌ కళాశాలల్లో గ్రంఽఽథపాలక పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్‌  ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తానని హామీచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఒ.శేషయ్య, డాక్టర్‌ నరమాల ప్రభాకర్‌, డాక్టర్‌ నారాయణరెడ్డి, చంద్రకాంత్‌, విజయ్‌మహేష్‌ పాల్గొన్నారు.

Read more