రెండేళ్ల తర్వాత మెమురైలు రాక

ABN , First Publish Date - 2022-01-04T04:50:56+05:30 IST

నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది.

రెండేళ్ల తర్వాత మెమురైలు రాక
మెము రైలు డ్రైవర్‌ను సత్కరిస్తున్న గౌస్‌బాషా, స్థానికులు

నాయుడుపేట,  జనవరి 3 : నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది. మెము రైలుకోసం 3 నెలలుగా ఫుట్‌బాల్‌ కోచ్‌ గౌస్‌బాషా, హిందీ ఉపాధ్యాయుడు ఫజీల్‌ రైల్వే ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు వినతిపత్రాలను అందజేశారు. రైల్వే మంత్రి కార్యాలయానికి కూడా  దరఖాస్తులు అందజేశారు. ఎట్టకేలకు మెము రైలురావడంతో వారు రైలు డ్రైవర్‌,  స్టేషన్‌ మాస్టర్‌ అలెగ్జాండర్‌ను పూలమాలలతో సత్కరించారు.

Read more