ఆర్థిక సాయం అందేలా కృషి : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-08-16T03:50:27+05:30 IST

బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి తెలిపారు. మండలంలో

ఆర్థిక సాయం అందేలా కృషి : ఆర్డీవో
పోలినేనిపాలెంలో బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న ఆర్డీవో సుబ్బారెడ్డి

వలేటివారిపాలెం, ఆగస్టు 15 : బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి తెలిపారు. మండలంలోని పోలినేనిపాలెంలో ఆదివారం ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న రైతు బూదాల సుబ్బారావు కుటుంబ సభ్యులను ఆర్డీవో తహసీల్దార్‌ సుందరమ్మతో కలిసి సోమవారం పరామర్శించారు. సుబ్బారావుకు ఎంత పొలం ఉంది... ఎంత పొలం కౌలుకు తీసుకున్నాడు ?. ఏయే పంటలు సాగుచేసేవాడు... వ్యవసాయంలో ఎంత నష్టం వచ్చింది.. ఎంత అప్పులు ఉన్నాయనే వివరాలను సుబ్బారావు కుటుంబసభ్యులనడిగి తెలుసుకున్నారు. ఆర్టీవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట ఏవో హేమంత్‌భరత్‌కుమార్‌, గ్రామస్థులు అనుమోల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Read more