ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-03-06T03:42:39+05:30 IST

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన అన్నారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు
ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన

గూడూరు, మార్చి 5: పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన అన్నారు. శనివారం పట్టణంలోని ఐసీఎస్‌ రోడ్డు, రాజావీధి, కుమ్మరవీధి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్య జటిలంగా మారడంతో  సర్వే నిర్వహించి అక్రమణలు తొలగించి సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా చెత్తాచెదారాలు రోడ్లుపై వేయకుండా మున్సిపల్‌ సిబ్బందికి అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, సీఐ నాగేశ్వరమ్మ, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, నాయకులు శ్రీనివాసులురెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, మురళి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more