ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు : కాకాణి

ABN , First Publish Date - 2022-09-11T04:10:21+05:30 IST

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్లికా

ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు : కాకాణి
మాట్లాడుతున్న మంత్రి కాకాణి

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 10: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్లికార్జునపురం పంచాయతీ మందబయట గిరిజనకాలనీలో శనివారం శ్రీవాణి ట్రస్ట్‌, టీటీడీల సాయంతో  సమరసత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ముఖ్య అతిథి పాల్గొన్న కాకాణి మాట్లాడుతూ  ఆర్థిక స్తోమత లేని గిరిజనకాలనీలో  ఆలయాన్ని నిర్మించడం శుభపరిణామమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజన కాలనీలు గుర్తించి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమరసత ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కోటా సునీల్‌కుమార్‌, కొత్తూరు లలితా మహేశ్వరి పీఠాధిపతి మహేష్‌స్వామి, ఎంపీడీవో హేమలత, తహసీల్దారు శ్యామలమ్మ, వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Read more