ఆలయ హుండీ చోరీ

ABN , First Publish Date - 2022-01-04T03:34:42+05:30 IST

మండలంలోని వనం తోపు సెంటర్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున హుండీ చోరీకి గు

ఆలయ హుండీ చోరీ
అపహరణకు గురైన హుండీ

పొదలకూరురూరల్‌, జనవరి 3 : మండలంలోని వనం తోపు సెంటర్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున హుండీ చోరీకి గురైంది. ఆలయం గ్రిల్స్‌కు ఉన్న తాళాన్ని పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. గర్భగుడిలోకి వెళ్లడానికి మరో తలుపు వుండటంతో ఆగంతకులు వరండాలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. సమీపంలోని పొలాల్లో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లారు. ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపరచడానికి వచ్చిన మహిళ చోరీ విషయాన్ని గుర్తించారు. దీంతో స్థానికులు చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కరీముల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more