6,7 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

ABN , First Publish Date - 2022-02-24T03:30:44+05:30 IST

మార్చి 6,7 తేదీల్లో గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్రమహాసభలు నిర్వహించనున్నామని, వీటిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన

6,7 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు
మహాసభల గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ నేతలు

 6,7 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

కావలి, ఫిబ్రవరి23:  మార్చి 6,7 తేదీల్లో గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్రమహాసభలు నిర్వహించనున్నామని,   వీటిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. కావలి సీపీఐ కార్యాలయంలో బుధవారం మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 6న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి కార్మికుల మహాప్రదర్శన జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు గురుదాస్‌ గుప్తా మైదానంలో బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖాన్ని పూరిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం, నాయకులు పసుపులేటి మహేష్‌, చేవూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Read more