-
-
Home » Andhra Pradesh » Nellore » 61 mandiki shokaj notisulu-MRGS-AndhraPradesh
-
61మందికి షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2022-02-20T04:36:02+05:30 IST
సమయపాలన పాటించకుండా సచివాలయాలకు ఆలస్యంగా వచ్చి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని 61మంది సచివాలయ సిబ్బందికి శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.

మనుబోలు, ఫిబ్రవరి 19: సమయపాలన పాటించకుండా సచివాలయాలకు ఆలస్యంగా వచ్చి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని 61మంది సచివాలయ సిబ్బందికి శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ టెలికాన్ఫ్‌రెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలతో 14 సచివాలయాల్లోని 61మందికి షోకాజ్ ఇచ్చి మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. మండలంలోని 14 సచివాలయాల్లో 130మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం 10గంటలకు, సాయంత్రం 5గంటలకు రెండు దఫాలుగా రోజూ బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సి ఉంది. కాగా 50శాతం మంది బయోమెట్రిక్ హాజరుపై నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.