9 నుంచి విద్యుత్‌ ఉద్యోగుల జాతీయ మహాసభలు

ABN , First Publish Date - 2022-09-19T09:57:09+05:30 IST

భారత విద్యుత్‌ ఉద్యోగుల సమాఖ్య 60వ వార్షికోత్సవం, జాతీయ మహాసభలను విశాఖపట్నంలో అక్టోబరు తొమ్మిది, పది తేదీల్లో

9 నుంచి విద్యుత్‌ ఉద్యోగుల జాతీయ మహాసభలు

విజయవాడ/విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భారత విద్యుత్‌ ఉద్యోగుల సమాఖ్య 60వ వార్షికోత్సవం, జాతీయ మహాసభలను విశాఖపట్నంలో అక్టోబరు తొమ్మిది, పది తేదీల్లో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌, కార్యదర్శి గణపతి తెలిపారు. మహాసభల పోస్టర్‌ను విజయవాడ గుణదలలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో విద్యుత్‌ రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు 2022 వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తామన్నారు. 

Read more