ఎంపీ రఘురామకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2022-07-03T04:10:54+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని..

ఎంపీ రఘురామకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమవరం పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని  జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది. రఘురామ రాజు భీమవరం పర్యటనలో హెలికాప్టర్  ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ను  విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి హెలికాప్టర్ ల్యాండింగ్ టేకాఫ్‎కు అనుమతి కోరినా స్పందన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని న్యాయవాది కోరారు. దాంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.

Read more