వారికి సహకరిస్తున్న నేతలను అరెస్ట్ చేయాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-08-09T17:16:54+05:30 IST

మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలని సజ్జల అనడం సరికాదన్నారు.

వారికి సహకరిస్తున్న నేతలను అరెస్ట్ చేయాలి: లోకేష్

అమరావతి: మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలని సజ్జల అనడం సరికాదన్నారు. సత్యాసాయి జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే.. అత్యాచారం కేసు నమోదు చేయకుండా.. తగాదా కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. నిందితులకు సహకరిస్తున్న వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయాలన డిమాండ్ చేశారు. 

Read more