Cpi Ramakrishna: మంత్రి బుగ్గన లేకపోతే అప్పులు పుట్టేవి కావు

ABN , First Publish Date - 2022-07-20T04:32:10+05:30 IST

రాష్ట్రంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) లేకపోతే..

Cpi Ramakrishna: మంత్రి బుగ్గన లేకపోతే అప్పులు పుట్టేవి కావు

నంద్యాల (Nandyala): రాష్ట్రంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) లేకపోతే జగన్ (Jagan) ప్రభుత్వానికి అప్పులు పుట్టేవికావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI State Secretary Ramakrishna) ఓ ప్రకటనలో అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఢిల్లీలో ప్రతి నెలలో  15 రోజులు అప్పులు ఎవరు ఇస్తారో అని ఎదురుచూపులు చూస్తుంటారన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో లక్ష ఇరవై వేల కోట్ల అప్పు తెస్తే  ఈ మూడేళ్లలో ఆర్థిక మంత్రి బుగ్గన దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేశారని రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2022-07-20T04:32:10+05:30 IST